Friday, March 20, 2009

ఉత్తమ సేవ -- Highest Service - Quote

Namaste!!!

For long time, I was looking for Telugu discourses or quotes from Sri Sathya Sai Baba. Today, I found one which attracted me, so I am posting it in Telugu here. If I get English translation of this quote, I will append to it.

Sai Ram!!!

వాలంటీర్లను
అవకాశాలు వెతుక్కుంటూ రావు. వాళ్లే సేవకు అవకాశాలను వెతుక్కోవాలి. ఆసక్తితో, సన్నద్ధ చిత్తంతో వెదికితే మే చుట్టూ అవకాశాలెన్నో కనబడగలవు. ఇతరులు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు పాషాణ హృదయులు మాత్రమే పట్టించుకోకుండా ఉంటారు. మీరు చేస్తున్న సేవలు పరులకు కాదు, మీకే అని గుర్తు పెట్టుకోండి! పూలు విసిరిన, రాళ్ళు వేసినా సమచిత్తంతో శాంతంగా అందుకోవాలి. దేహభ్రాంతి ఉన్నప్పుడే నిందాస్తుతుల బెడద. 'నేను దేహమును కాను, దేహిని' అనే భావం అలవరచుకొంటే ఉత్తమ సేవ చేయగలుగుతారు. ఇతరులకు ఆనందంగా సేవ చేయండి. మీరు ఎక్కువవారనే భవమూ, విసుగుదల సూచించే ముఖమూ సేవ చేసేడప్పుడు ఉండకూడదు. ఇతరులకు సేవ చేసే అవకాశం దొరికినందుకు మీకు నిజంగా సంతోషం కలిగినట్లు ఎదుటివారికి కనబడాలి. మీ ముఖాన చిరునవ్వు మెరుస్తూ ఉంటే మిమ్మల్ని చుసినవల్లందరూ మీ ఆనందమునుంచి ఉద్దీపనం పొందుతారు. సేవకార్యక్రమానికి పూనుకున్నప్పుడు ' పని నా పరిధిలోనిది అవునా కాదా' అని తర్కించవద్దు. సేవకు హద్దులు అవధులు లేవు. మీకు నియమించిన దానికంటే ఎక్కువ భారం మోయనవసరం లేదు. ఇతరులు చేస్తున్న పనిలో అనవసరంగా జోక్యం చేసుకోరాదు. అయినదానికి కానిదానికి ఇతరులను విమర్శించరాదు. ప్రశాంతి నిలయానికి చెందిన
మనుష్యుల స్థాయినీ, గౌరవాన్ని నిలబెట్టవలెను. -- శ్రీ సత్య సాయి బాబా (సనాతన సారథి మార్చి 2009)

No comments: