మనస్సును అరికట్టుకోండి!!
స్వామి ఆజ్ఞను తప్పక అనుసరించుటే దీక్షగా మీరు తలంచవలెను. దానికి శ్రద్ధ, భక్తీ రెండూ అవసరం. అదే మీరు చేయవలసిన తపస్సు. అంతేగాని, దేహమును కృశింపజేయటం కాదు. పుట్టపైన మర్దించిన పాము మరణించునా! తనువును దండించిన తత్వజ్ఙానము కలుగునా! తలంపులను దండింపవలయును. అటూ ఇటూ సంచరించే గడియారపు పెంద్యులమును నిలిపి వేయవలెననిన, 'కీ'ను యీయకుండిన చాలు. అట్లే, సంకల్ప వికల్పములనే 'కీ' ను వదలితే మనస్సనే పెండ్యులము చంచలత్వమును వీడి పరమాత్ముని పాదారవిందముల యందు లగ్నమై స్థిరముగా నిలుచును. సంకల్పము ఒక విత్తనంవంటిది. దానిని మనస్సులో నాటితే అదొక పెద్ద వృక్షమై, ఏకత్వమునుండి అనేకత్వము పెరిగి, ఏ ప్రయత్నమూ లేకుండగానే కోట్లకొలది విత్తనములు అవిర్భవించును. సంకల్పములను అరికట్టక ఏకాగ్రత కుదరదు. అందుకు నిరంతర పరిశ్రమ, అఖండ సాధన అవసరము. ఆ సాధనలోకూడ అవిశ్వాసము అంకురించిన అన్నీ వ్యర్థమైపోవును. -- బాబా (సనాతన సారథి January 2007)
No comments:
Post a Comment